బారాముల్లాలో ఎన్కౌంటర్ ముగ్గురు ఉగ్రవాదులు హతం.. పోలీస్ వీరమరణం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పాక్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో జమ్మూకశ్మీర్ పోలీస్ వీరమరణం పొందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బారాముల్లాలోని క్రీరి ప్రాంతంలో నజీభట్ క్రాసింగ్ వద్ద ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు, పోలీసుల సంయుక్త బృందం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
ఈ క్రమంలో దాక్కున్న ఉగ్రవాదులు బలగాలను చూసి, వారి పైకి కాల్పులు జరిపాయి. సైన్యం సైతం ప్రతిగా కాల్పులు జరుపడంతో ముగ్గురు హతమయ్యారు. ముగ్గురు పాక్కు చెందిన ఉగ్రవాదులని తెలిపారు. టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో జేకేపీ జవాన్ వీరమరణం పొందారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ ఐజీపీ తెలిపారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని, ప్రస్తుతం కూంబింగ్, సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

