న్యూఢిల్లీ, డిసెంబర్ 11: వచ్చే జనవరి నాటికి ఉల్లిగడ్డల ధరలు తగ్గుతాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సగటున కిలో ఉల్లిగడ్డ రూ.57 వరకు పలుకుతున్నదని, ఇది జనవరి నాటికి రూ.40కన్నా తక్కువకు లభించే అవకాశముందని వెల్లడించారు. కిలో రూ.100కు చేరుకునే అవకాశముందని వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. ఎగుమతులపై ఆంక్షల నేపథ్యంలో ధరలు క్రమంగా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.