Supreme Court | వివాహ సంబంధాల విషయాలపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తల మధ్య జరిగిన రహస్య సంభాషణను సైతం కోర్టులో సాక్ష్యంగా స్వీకరించవచ్చని స్పష్టం చేసింది. పంజాబ్-హర్యానా హైకోర్టు నిర్ణయాన్ని తీసిపుచ్చింది. సీక్రెట్ రికార్డింగ్స్ గోప్యతా ఉల్లంఘనగా పరిగణించిన హైకోర్టు.. ఫ్యామిలీ కోర్టులో ఆధారంగా అనుమతించకూడదంటూ తీర్పును ఇచ్చింది. అయితే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ ఇలాంటి రహస్య రికార్డింగ్స్ దాంపత్యంలోని సామరస్యాన్ని దెబ్బతీస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటివి భాగస్వామిపై గూఢచర్యాన్ని ప్రోత్సహించడమేనన్నారు. అయితే, భార్యాభర్తలు ఇలాంటి కాల్ రికార్డింగ్స్ చేసుకునే వరకు వచ్చారంటే ఇద్దరు ఏ స్థాయికి వెళ్లాలో అర్థం చేసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది.
పంజాబ్‌లోని భటిండాకు చెందిన దంపతులు 1955 హిందూ వివాహ చట్టంలోని సెక్షన్-13 కింద విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకెక్కారు. విచారణ సమయంలో భార తనను క్రూరంగా హింసిస్తుందంటూ భర్త ఆరోపించాడు. తన ఆరోపణలను నిరూపించేందుకు కాల్ రికార్డింగ్స్ సీడీని ఫ్యామిలీ కోర్టుకు సాక్ష్యంగా చూపించాడు. అయితే, తన అనుమతి లేకుండానే కాల్స్‌ను భర్త కాల్ రికార్డింగ్ చేరశాడని.. వాటిని సాక్ష్యంగా స్వీకరించడం తన గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని హైకోర్టులో వాదనలు వినిపించారు. ఆమె వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆ రికార్డింగ్స్‌ను సాక్ష్యాలను స్వీరించొద్దని హైకోర్టు సూచించింది. ఇలాంటి సాక్ష్యాలను అనుమతించడం వల్ల సామరస్యాన్ని, వైవాహిక సంబంధాలను ప్రమాదంలో పడేస్తుందని.. ఎందుకంటే ఇది జీవిత భాగస్వాములపై గూఢచర్యం ప్రోత్సహిస్తుందన్న కొన్ని వాదనలు ఉన్నాయని హైకోర్టు తెలిపింది. ఇది సాక్ష్య చట్టంలోని సెక్షన్ 122 యొక్క ఉద్దేశ్యాన్ని ఉల్లంఘిస్తుందని పేర్కొంది. అయితే, హైకోర్టు ఆదేశాలను భర్త సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు రహస్య రికార్డింగ్స్‌ను సైతం ఆధారాలు స్వీకరించవచ్చని కోర్టు తీర్పును వెలువరించింది.