Special Trains to Sabarimala | శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకున్నది. గత నెలలో భక్తులకు శబరిమల అయ్యప్ప స్వామి మండల-మకర విలక్కు దర్శనాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు శుక్రవారం తెలిపింది. ఈ నెల 18 నుంచి 26 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
సికింద్రాబాద్-కొల్లాం, కొల్లాం-సికింద్రాబాద్, కాచిగూడ-కొల్లాం, కొల్లాం-కాచిగూడ, నాందేడ్-కొల్లాం, తిరుపతి-కొల్లాం, తిరుపతి-నాందేడ్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈ సౌకర్యాన్ని అయ్యప్ప భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది.