న్యూఢిల్లీ: విదేశాల నుంచి వచ్చే స్కాచ్ విస్కీ(Scotch whisky) ధరలు తగ్గనున్నాయి. త్వరలో భారత్, బ్రిటన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్‌టీఏ) జరగనున్నది. ఆ ఒప్పందం తర్వాత విస్కీ ధరలు తగ్గే ఛాన్సు ఉన్నది. స్కాచ్ విస్కీపై ఉన్న సుంకాన్ని తగ్గించనున్నారు. తక్షణమే 150 శాతం నుంచి 75 శాతానికి సుంకాన్ని తగ్గించనున్నారు. ఆ తర్వాత రాబోయే పదేళ్లలో ఆ సుంకం మరో 40 శాతం తగ్గుతుందని తెలుస్తోంది. ఈనెలలో లండన్‌లో జరగనున్న భేటీలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరనున్నది. ట్రేడ్ ఒప్పందం విప్లవాత్మక మార్పు తెస్తుందని స్కాచ్ విస్కీ అసోసియేషన్ పేర్కొన్నది. దీని ద్వారా రానున్న అయిదేళ్లలో 11 వేల కోట్ల వ్యాపారం జరిగే ఛాన్సు ఉన్నది. బ్రిటన్, భారత్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. స్కాచ్ విస్కీ ఎగుమతుల్లో అతిపెద్ద మార్కెట్‌గా మారనున్నట్లు స్కాచ్ విస్కీ అసోసియేషన్ సీఈవో మార్క్ కెంట్ తెలిపారు.