Skin Cells | న్యూఢిల్లీ: సంతాన లేమితో బాధపడేవారికి ఆశలు రేకెత్తించే వార్త ఇది. చర్మపు జీవాణువులను అండాలుగా మార్చి, తద్వారా ఆరోగ్యవంతమైన పిండాలను సృష్టించే ప్రక్రియను ఒరెగావ్ హెల్త్ అండ్ సైన్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అభివృద్ధి చేశారు. వంధ్యత్వ చికిత్సకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.
ఎలుకలపై దీనిని విజయవంతంగా ప్రయోగించినట్లు ఓ పత్రికా ప్రకటనలో చెప్పారు. ఏదో ఓ నాటికి దీని ద్వారా సజాతి జంటలు కూడా ఇరువురి జీవ సంబంధం గల పిల్లలను పొందడానికి అవకాశం వస్తుందని తెలిపారు. దాత అండానికి సొంతంగా న్యూక్లియస్ లేనపుడు, చర్మపు జీవ కణపు న్యూక్లియస్ను ఆ డోనర్ ఎగ్గా మార్చడం ద్వారా ఐవీజీ (ఇన్విట్రో గమెటోజెనెసిస్)ని సాధించినట్లు తెలిపారు. సెల్ రీప్రోగ్రామింగ్కు సాధారణంగా అవసరమైన కల్చర్ పీరియడ్ నిడివిని తగ్గించడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని చెప్పారు.