Cyclone Mandous | పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం
Cyclone Mandous | బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను ఇవాళ తెల్లవారుజామున తీవ్ర తుఫాన్‌గా రూపు మార్చుకుని తీరం వైపు దూసుకొస్తోంది. దాంతో భారత వాతావరణ కేంద్రం అధికారులు తమిళనాడులోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేశారు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 27 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. చెన్నై సహా చంగల్పట్టు, కాంచీపురం, విలుప్పురం, కొడలూర్, రాణీపేట్, వెల్లూర్, తిరువల్లూరు తదితర జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

తుఫాను మండూస్ ప్రస్తుతం కరైకల్‌కు 240 కిలోమీటర్లు, చెన్నైకి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి వాయవ్య బంగాళాఖాతం వైపు కదులుతున్న మండూస్ తుఫాను.. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. తర్వాత శుక్రవారం అర్ధరాత్రికి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్యలో మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం పశ్చిమ వాయవ్యంగా పయనించి శనివారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడుతుందని వెల్లడించింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటలకు 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.
తుఫాను నేపథ్యంలో దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా, ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తారంగా, ఉత్తర కోస్తాలో ఎక్కువచోట్ల మోస్తరు వర్షాలు, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు