లక్నో: పహల్గామ్ ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా ఒక స్కూల్ విద్యార్థితో బలవంతంగా పాకిస్థాన్ జెండాపై మూత్ర విసర్జన చేయించారు. (School boy Forced To Urinate On Pak Flag) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 28న పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసన జరిగింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ జెండాను నేలపై ఉంచి ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాగా, ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థి తన స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. నేలపై పాక్ జెండా ఉండటాన్ని అతడు చూశాడు. ఈ నేపథ్యంలో అక్కడున్న కొందరు వ్యక్తులు ఆ బాలుడ్ని చుట్టుముట్టారు. అతడి పేరు అడిగారు. ముస్లిం మతానికి చెందినవాడని తెలుసుకుని తిట్టారు. ఆ విద్యార్థితో బలవంతంగా పాక్ జెండాపై మూత్ర విసర్జన చేయించారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాగే ఈ సంఘటనపై ఆ విద్యార్థి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.