జైపూర్: పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. (School Bus Overturns) ఈ సంఘటనలో ఆ బస్సులోని స్కూల్ విద్యార్థులు గాయపడ్డారు. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. రాజస్థాన్లోని కోటాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం మధ్యాహ్నం పిల్లలను ఇంటికి తరలిస్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో రోడ్డు దిగువకు దూసుకెళ్లి బోల్తా పడింది. గమనించిన స్థానికులు వెంటనే ఆ స్కూల్ బస్సు వద్దకు చేరుకున్నారు. అద్దాలు పగులగొట్టి అందులోని పిల్లలను బయటకు తెచ్చారు.
కాగా, స్కూల్ బస్సులో ప్రయాణించిన సుమారు 50 మంది విద్యార్థులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. ఒకరు మరణించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన పిల్లలను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కూల్ బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
कोटा में ट्रेंचिंग ग्राउंड के पास स्कूल बस पलटी, एक बच्चे की मौत की सूचना, कई गंभीर घायल. pic.twitter.com/wdvMxiHOsa
— Sarvesh Sharma (@ssarveshsharma) October 21, 2024