న్యూఢిల్లీ: ఒక స్కూల్లో విద్యార్థుల మధ్య ఫైట్ జరిగింది. ఈ ఘర్షణలో ఒక స్టూడెంట్ మరణించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు ఒక విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. (School boy Dies in Fight) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఉదయం చిన్మయ విద్యాలయంలో మార్నింగ్ ప్రేయర్ తర్వాత ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులు స్వల్పంగా కొట్టుకున్నారు. ఈ సంఘటనలో 12 ఏళ్ల ప్రిన్స్ అస్వస్థతకు గురై మరణించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆ బాలుడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. నోటి నుంచి నురగ రావడాన్ని పరిశీలించారు. దీంతో ఆ బాలుడికి మూర్ఛ సంబంధిత సమస్య ఉండవచ్చని డాక్టర్లు అనుమానించారు.
కాగా, ఈ సంఘటన నేపథ్యంలో ఆ స్కూల్ వద్ద వందలాది మంది నిరసన తెలిపారు. తన కుమారుడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని ప్రిన్స్ తండ్రి వెల్లడించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఆ స్కూల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ప్రిన్స్‌తో ఫైట్ చేసి అతడి మరణానికి కారణమైన 12 ఏళ్ల క్లాస్‌మేట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.