Supreme Court | తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేదానికి వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఐఎంఏ అధ్యక్షుడు ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వివాదాస్పద వ్యాఖలపై బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు అశోకన్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ అంశం ప్రస్తుతంపై విచారణ పెండింగ్‌లో ఉన్నది. అసోసియేషన్ నెలవారీ ప్రచురణ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెబ్‌సైట్‌తో పాటు జాతీయ మీడియా సంస్థలోనూ బేషరతుగా క్షమాపణలు చెప్పినట్లు ఐఎంఏ అసోసియేషన్ తరఫు న్యాయవాదులు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనానికి తెలిపారు.
తాను క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేశానన్న ఆయన.. మరోసారి వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రచురణ మొదటి పేజీతో పాటు వెబ్సెట్లోనూ పాప్ అప్‌గా కనిపిస్తుందని న్యాయవాది పట్వాలియా తెలిపారు. కమాపణలు చెబుతూ వార్తా సంస్థకు పంపగా పబ్లిష్ చేసిందని.. ఇతర మీడియా సంస్థలతోనూ షేర్ చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ తరపున హాజరవుతున్న సీనియర్ న్యాయవాది బల్బీర్ సింగ్‌ను జస్టిస్ హిమా కోహ్లీ, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం అశోకన్ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌ను చూశారా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగ్ మాట్లాడుతూ ప్రతివాదులు అఫిడవిట్‌ను చూసేందుకు, తదుపరి విచారణ సమయంలో కోర్టుకు సహాయం చేసేందుకు అనుమతించవచ్చని తెలిపారు. ఈ మేరకు కోర్టు ఆగస్టు 6వ తేదీకి విచారణ వాయిదా వేసింది. పతంజలి ప్రకటనలపై ఐఎంఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ సమయంలో వైద్యుల అనైతిక చర్యలను ప్రస్తావించింది. అయితే, ఓ ఇంటర్వ్యూలో ఐఏంఏ ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో బహిరంగ క్షమాపణలు చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.