Supreme Court | న్యూఢిల్లీ, జనవరి 29 : పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్య కోర్సుల అడ్మిషన్లలో ని వాసం ఆధారంగా రిజర్వేషన్ల కోటాను సు ప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ విధమైన రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధమని, సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుందని సర్వోన్నత న్యా యస్థానం తేల్చింది. పీజీ మెడికల్ కోర్సుల అడ్మిషన్లలో నివాస ఆధారిత రిజర్వేషన్లను రద్దు చేస్తూ, ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. పీజీ మెడికల్ కోర్సుల అడ్మిషన్లు క చ్చితంగా మెరిట్ ఆధారంగా ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఈ తీ ర్పు ఇప్పటికే మంజూరు చేసిన రిజర్వేషన్లను ప్రభావితం చేయదని సుప్రీంకోర్టు పే ర్కొన్నది.
‘పీజీ మెడికల్ కోర్సుల్లో రెసిడెన్స్ ఆధారిత రిజర్వేషన్లు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-14కు విరుద్ధం. మనమంతా భారత భూభాగంలో స్థిర నివాసులమే. ఇందులో ప్రాంతీయ, రాష్ట్ర నివాసం.. అనేవి లేవు. దేశంలో ఎక్కడైనా నివాసాన్ని ఎంచుకునే, వ్యాపారం లేదా వృత్తిని కొనసాగించే హక్కును మనం కలిగివున్నాం. భారతదేశమంతటా విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని ఎంచుకునే హక్కును రాజ్యాంగం మనకు కల్పించింది’ అని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు 2019లో నివాస ఆధారిత రిజర్వేషన్ చెల్లుబాటు కాదని తీర్పు చెప్పగా, తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, తాజాగా హైకోర్టు తీర్పును సమర్థించింది.