న్యూఢిల్లీ: హర్యానా(Haryana)లోని నుహ్ జిల్లాలో జరిగిన మత ఘర్షణల(Communal Clashes)పై సుప్రీంకోర్టు రియాక్ట్ అయ్యింది. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని, సీసీటీవీలను ఏర్పాటు చేయాలని కోర్టు(Supreme Court) ఆదేశించింది. నిరసన ప్రదర్శన సమయంలో ఎటువంటి హింస జరగకుండా చూడాలని, విద్వేష ప్రసంగాలు కూడా ఉండవద్దు అని కోర్టు చెప్పింది. పారామిలిటరీ దళాలకు చెందిన బలగాల్ని మోహరించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. హర్యానాలో జరిగిన హింసను ఖండిస్తూ ఇవాళ వీహెచ్పీ, భజరంగ్ దళ్ మద్దతుదారులు ఢిల్లీలో సుమారు 30 చోట్ల నిరసనలు చేపట్టారు. నుహ్లో జరిగిన హింస వల్ల ఆరుగురు మృతిచెందారు. భారీ స్థాయిలో ప్రాపర్టీ నష్టమైంది. ప్రస్తుతం ఆ ప్రాంతాలు కర్ఫ్యూలో ఉన్నాయి.