న్యూఢిల్లీ, జనవరి 24 : ఆదాయపు పన్ను చట్టం కింద టీడీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిల్‌ను పరిశీలించడానికి సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ‘క్షమించండి, దీనిని మేం ఆలకించం, కావాలంటే మీరు దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చు’ అని ధర్మాసనం తెలిపింది. న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ వ్యక్తిగత హోదాలో అడ్వకేట్ అశ్వనీ దూబేతో కలిసి వేసిన పిల్‌ను విచారించిన న్యాయమూర్తులు ఈ పిల్లో ఐటీ నిబంధనలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉండవచ్చునని, దీనిపై హైకోర్టులో కేసు ఫైల్ దాఖలు చేయవచ్చునని సూచించింది.