న్యూఢిల్లీ: అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన వార్‌లో తీవ్ర నష్టం జరిగింది. అమెరికాకు చెందిన సుమారు 20 సైనిక కేంద్రాలను ఇరాన్ ధ్వంసం చేసినట్లు తెలిసింది. శాటిలైట్ ఇమేజ్‌ల(Satellite Images) ఆధారంగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ఈ అంచనా వేసింది. అనుకున్న దాని కన్నా ఎక్కవ స్థాయిలో దాడులు జరిగాయని, అమెరికాకు భారీగానే నష్టం జరిగినట్లు ఆ ఇమేజ్‌ల ద్వారా అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో ఉన్న 8 దేశాలను ఇరాన్ టార్గెట్ చేసింది. ఆ దాడులు వల్ల అమెరికాకు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రీఫుయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్, రేడార్లు ధ్వంసం అయ్యాయి.
అయితే ఇరాన్ షేర్ చేస్తున్న ప్లానెట్ సంస్థ శాటిలైట్ ఇమేజ్లపై అమెరికా నిషేధం విధించింది. ఇతర అంతర్జాతీయ ప్రొవైడర్ల ద్వారా శాటిలైట్ పిక్స్ తీసుకున్న ఆ మీడియా సంస్థ.. ప్లానెట్ కంపెనీకి చెందిన పాత ఇమేజ్‌లతో పోల్చింది. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, ఇరాక్, జోర్దాన్, బహ్రెయిన్, ఒమన్ దేశాల్లో ఉన్న అమెరికా కేంద్రాలను ఇరాన్ టార్గెట్ చేసింది. కొన్ని సంస్థల అంచనా ప్రకారం సుమారు 28 అమెరికా బేస్‌లు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. ఖరీదైన హార్డ్‌వేర్ డ్యామేజ్ కూడా జరిగింది.
యూఏఈలోని అల్ రువాయిస్, అల్ సదర్తో పాటు జోర్దాన్‌లో ఉన్న మువాఫక్ సాల్టీ ఎయిర్‌బేస్‌ను డ్యామేజ్ చేశారు. అమెరికా ప్రస్తుతం 8 థాడ్ బ్యాటరీలను ఆపరేట్ చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రదేశాల్లో వాటిని మోహరించింది. ఆ బ్యాటరీలను ఆపరేట్ చేయాలటే కసీనం`100 మంది కావాల్సిందే. వాటి ఇంటర్సెప్టార్ ఖరీదు రౌండ్‌కు 12.7 మిలియన్ల డాలర్లు. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌లో ఉన్న అమెరికా రీఫుయలింగ్, నిఘా విమానాలపై కూడా ఇరాన్ దాడి చేసింది. శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా దీన్ని స్పష్టంగా అంచనా వేశారు.
సుమారు 700 మిలియన్ల డాలర్ల ఖరీదైన ఈ-3 సెంట్రీ నిఘా ప్లేన్‌ను కూడా పేల్చినట్లు గుర్తించారు. కువైట్‌లో ఉన్న అలీ అల్ సలీమ్ ఎయిర్‌బేస్‌తో పాటు క్యాంప్ అరిఫ్జాన్లో ఉన్న బేస్‌ను కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. సైట్ వద్ద ఫ్యూయల్ స్టోరేజ్ బంకర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ హ్యాంగర్లు, ట్రూప్ అకామిడేషన్ ప్రాంతాలు ధ్వంసం అయినట్లు మలార్ శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించారు.