Sarad Pawar | తన సామాజిక వర్గం పేరు దాచుకోవాలనే ఉద్దేశం తనకు లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. దాని పేరుతో రాజకీయం చేయాలని అనుకోలేదన్నారు. శరద్ పవార్ ‘ఓబీసీ` వర్గానికి చెందిన వారంటూ ఓ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరలైంది.
దీంతో ఆయన స్పందిస్తూ.. ‘నా సామాజిక వర్గం ఏమిటో ప్రపంచమంతా తెలుసు. దాని ఆధారంగా ఇప్పటి వరకూ రాజకీయం చేయలేదు. ఇక ముందూ చేయబోనూ. కానీ ఆ వర్గం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను’ అని చెప్పారు.
ఈ విషయమై శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే సైతం స్పందించారు. ఇదొక తప్పుడు ధ్రువ పత్రం అని వ్యాఖ్యానించారు. ఇటువంటి వాటిని వైరల్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.