న్యూఢిల్లీ, జూన్ 2: ప్రముఖ సంతూర్ వాయిద్యకారుడు పండిట్ భజన్ సోపోరి (73) గురువారం గురుగ్రాంలో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్నారు. 2004లో పద్మశ్రీ అవార్డు, 1992లో సంగీత నాటక అకాడమీ అవార్డు, జమ్ము, కశ్మీర్ రాష్ట్ర జీవితసాఫల్య పురస్కారం వంటి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు, అవార్డులు ఆయనను వరించాయి. ఆయన ఇద్దరు కుమారులు సొరభ్, అభయ్ కూడా సంతూర్ వాయిద్యాకారులే కావడం విశేషం.