ముంబై: మహారాష్ట్రకు చెందిన శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే అభ్యర్థికి లోక్‌సభ స్పీకర్ పదవి రాకపోతే టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ (రామ్‌విలాస్)లను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచ్ఛిన్నం చేస్తారని ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్ ఎన్డీయే మిత్ర పక్షాలను ఈ మేరకు హెచ్చరించారు. బీజేపీ గురించి తెలిసిన తాను అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ‘ఈసారి పరిస్థితి 2014, 2019 మాదిరిగా లేదు. ప్రభుత్వం స్థిరంగా లేదు’ అని అన్నారు. టీడీపీకి స్పీకర్ పదవి ఇస్తే తాము స్వాగతిస్తామని చెప్పారు.
కాగా, గత పదేళ్లలో దేశంలో మోదీ, అమిత్ షా వల్ల ఎలాంటి హాని జరిగినా ఆర్ఎస్ఎస్దే బాధ్యత అని సంజయ్ రౌత్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ పరిరక్షించాలన్నారు. మణిపూర్‌లో పరిస్థితిపై ఆర్ఎస్ఎస్ విమర్శలను ఆయన స్వాగతించారు. తమ తప్పులను సరిదిద్దుకోవాలనుకుంటే వారికి మంచిదని వ్యాఖ్యానించారు.