Udhayanidhi Stalin: సనాతనం నిర్మూలించడమంటే.. గుళ్లకు వెళ్లకపోవడం కాదు: ఉదయనిధి స్టాలిన్
Udhayanidhi Stalin: సనాతన ధర్మాన్ని నిర్మూలించడం అంటే.. ప్రజలు గుడికి వెళ్లకూడదని తన ఉద్దేశం కాదు అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఇవ్వాలని, ఆలయాల్లోనే కాదు, యావత్ సమాజంలో సమానత్వం పాటించాలన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన తన ప్రసంగంపై వస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
చెన్నై: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని తమిళనాడు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) గతంలో అనేక సార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం సీఎం విజయ్ బలపరీక్ష సమయంలో కూడా ఆయన మాట్లాడుతూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే దానిపై గురువారం ఉదయనిధి స్టాలిన్ క్లారిటీ ఇచ్చారు. సనాతన విధానాలను నిర్మూలించడం అంటే.. ప్రజలు గుడికి వెళ్లకూడదని కాదు అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఇవ్వాలని, ఆలయాల్లోనే కాదు, యావత్ సమాజంలో సమానత్వం పాటించాలన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన తన ప్రసంగంపై వస్తున్న విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ప్రజలను విభజిస్తున్న సనాతన ధర్మాన్ని నాశనం చేయాలన్నది తన ఉద్దేశమన్నారు. అయితే తనపై వస్తున్న విమర్శలకు తలొగ్గేది లేదన్నారు.
தமிழ்நாடு சட்டப்பேரவையில நான் பேசுனப்ப, ”மக்களைப் பிரிக்கும் சனாதனம் நிச்சயம் ஒழிக்கப்பட வேண்டும்”-னு குறிப்பிட்டேன். இதுக்காக என்னை சில பேர் criticize பண்றாங்க.
இதுக்கெல்லாம் பயப்படுற ஆள் நான் இல்ல. எதிர்ப்புலேயே வளர்ந்தது தான் திராவிட இயக்கம். அந்த வகையில, ஒரு சின்ன…
— Udhay – தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@Udhaystalin) May 14, 2026
హిందువులకు కాదు, హిందుత్వకు వ్యతిరేకం : టీవీకే
డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను టీవీకే తోసిపుచ్చింది. సనాతన ధర్మాన్ని స్టాలిన్ తప్పుగా అర్థం చేసుకున్నారని తమిళనాడు మంత్రి, టీవీకే జనరల్ సెక్రటరీ అధవ అర్జున తెలిపారు. ఆ సబ్జెక్టులో స్టాలిన్‌కు సరైన అవగాహన లేదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం సెక్యులర్ విధానాలను పాటిస్తున్నట్లు చెప్పారు. అన్ని మతాల ప్రజలకు తమిళనాడు ప్రభుత్వం గౌరవం ఇస్తుందని, సమానత్వ సూత్రంలో ఉన్న పరమార్థం అదే అని అర్జున తెలిపారు. సనాతన ధర్మం అంటే ఉదయనిధి స్టాలిన్‌కు తెలియదని, హిందువులు.. ముస్లింలు, క్రైస్తవులు.. అందర్నీ మేం సమానంగా చూశామని చెప్పారు.
వ్యక్తిగతంగా తనకు ఎటువంటి మతం లేదని అర్జున అన్నారు. కానీ మంత్రిగా అన్ని మత విశ్వాసాలను గౌరవిస్తానన్నారు. రాజకీయ వ్యతిరేకతను మత వ్యతిరేకతతో పోల్చలేమన్నారు. మేం హిందువులకు వ్యతిరేకం కాదు అని, కానీ హిందుత్వకు వ్యతిరేకం అన్నారు. హిందుత్వ అంటే ఇతరులపై తమ మతాన్ని రుద్దడమే అని ఆయన పేర్కొన్నారు. సనాతన ధర్మం గురించి దేశంలో భిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఉత్తర భారత దేశంలో సనాతన ధర్మం అంటే దాన్ని హిందుమతం విశ్వాసాలతో పోల్చుతారన్నారు. కానీ తమిళనాడులో రాజకీయ, సామాజిక కోణం ఉంటుందన్నారు. కుల పెత్తనం, అసమానత్వం ఉంటాయన్నారు. తమిళనాడులో సనాతనం అంటే అసమానత్వం అన్నారు. తమ పార్టీ ఎప్పుడూ అసమానతకు వ్యతిరేకంగా ఉంటుందని, కానీ ఏ మతానికి కాదు అని అర్జున తెలిపారు. రాజకీయ క్షేత్రాల్లో సనాతనం గురించి మాట్లాడుతునప్పుడు, ఉదయనిధి స్టాలిన్ దీనిపై బహిరంగంగా స్పష్టతను ఇవ్వాలన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

