శామ్సంగ్లో 100 మంది ఎగ్జిక్యూటివ్‌లపై వేటు
పెరుగుతున్న ఖర్చులు, మందగించిన అమ్మకాల నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ ఇండియా భారత్‌లో ఉద్యోగాల కోతను మొదలు పెట్టింది. టెలివిజన్, గృహోపకరణాల విభాగంలో ఎగ్జిక్యూటివ్‌లు, ఉద్యోగులను తొలగిస్తున్నది. విశ్వసనీయ వర్గాల ప్రకారం వివిధ స్థాయిల్లో 80-100 మంది ఎగ్జిక్యూటివ్‌లను రాజీనామా చేయమని కంపెనీ యాజమాన్యం కోరింది.
న్యూఢిల్లీ : పెరుగుతున్న ఖర్చులు, మందగించిన అమ్మకాల నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ ఇండియా భారత్‌లో ఉద్యోగాల కోతను మొదలు పెట్టింది. టెలివిజన్, గృహోపకరణాల విభాగంలో ఎగ్జిక్యూటివ్‌లు, ఉద్యోగులను తొలగిస్తున్నది. విశ్వసనీయ వర్గాల ప్రకారం వివిధ స్థాయిల్లో 80-100 మంది ఎగ్జిక్యూటివ్‌లను రాజీనామా చేయమని కంపెనీ యాజమాన్యం కోరింది. వీరిలో డైరెక్టర్ స్థాయి అధికారులు, టీమ్ లీడర్లు కూడా ఉన్నారు. ప్రపంచ మార్కెట్లో మెమొరీ చిప్స్ ధరలు రెట్టింపు కావడం, స్మార్ట్ఫోన్ల అమ్మకాలు తగ్గడం, ముడి సరకు ధరలు పెరగడంతో కంపెనీపై ఒత్తిడి పెరిగింది. రాయిటర్స్ కథనం ప్రకారం కంపెనీలో 2028 వరకు చిప్‌ల కొరత సంక్షోభం కొనసాగవచ్చు.
25 శాతం సేల్స్, మార్కెటింగ్ సిబ్బందిపై ప్రభావం
ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం కంపెనీలోని సేల్స్, మార్కెటింగ్ సిబ్బందిలో 25 శాతంపై ఉద్యోగ కోతల ప్రభావం ఉండొచ్చు. మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా నియమించుకొన్న సిబ్బందిపైనా కోతల ప్రభావం ఉండనుంది. బాధిత ఉద్యోగుల సమాచారం ప్రకారం.. కొన్ని రోజులుగా చిన్న బ్యాచ్‌ల వారీగా కంపెనీ వారికి ఉద్వాసన లేఖలు జారీ చేస్తున్నది. కొందరిని నోటీస్ పీరియడ్ పూర్తి చేయకుండానే వెంటనే కంపెనీని వదిలి వెళ్లాలని కోరుతున్నది. తొలగిస్తున్న ఉద్యోగులకు మూడు నెలల జీతంతో పాటు, వారి సర్వీసులో ప్రతి సంవత్సరానికి ఒక నెల జీతాన్ని మేనేజ్మెంట్ ఆఫర్ చేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

