న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్లలో లేవనెత్తిన అంశాలపై పార్లమెంటుకు శాసనాధికారం ఉన్నదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్లను సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం నాలుగో రోజు విచారించింది. ఒకవేళ స్వలింగ వివాహాలకు అనుమతి ఇస్తే పర్యవసానాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.