pro tem Speaker : ప్రొటెం స్పీకర్ను ఆనవాయితీకి అనుగుణంగా ఎంపిక చేస్తారని, చట్టం ద్వారా కాదని బీజేపీ ఎంపీ సంబిట్ పాత్రా పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతున్నదని స్పష్టం చేశారు.
ఈ ప్రక్రియను విచ్ఛిన్నం చేసేందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భర్తృహరి మహతాబ్ వరుసగా ఏడోసారి ఎంపీగా కొనసాగుతున్నారని, సుదీర్ఘకాలంగా వరుసగా చట్టసభలకు ఎంపికవుతున్నవారిని ప్రొటెం స్పీకర్గా నియమించడం ఆనవాయితీ అని పేర్కొన్నారు.
18వ లోక్సభలో ప్రొటెం స్పీకర్ అయ్యే అర్హత భర్తృహరికి ఉందని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ కే. సురేష్ విషయానికి వస్తే ఆయన 8 సార్లు ఎంపీగా గెలిచినప్పటికీ మధ్యలో విరామం ఉన్నదని గుర్తుచేశారు. కే. సురేష్ వరుసగా ఎంపీ కావడం ఇది 4వసారని గుర్తుచేశారు. భర్తృహరి మహతాబ్ వరుసగా ఏడోసారి ఎంపీగా ఎన్నికవడంతో ఆయన విషయంలో ఆనవాయితీని పాటించడం జరుగుతుందని తెలిపారు.
Read More :
Kalki 2898 AD | ‘కల్కి’ టికెట్ ధరల పెంపు.. ప్రభాస్ సినిమా చూడాలంటే పర్సు ఖాళీ అవ్వాల్సిందే.!