న్యూఢిల్లీ, డిసెంబర్ 7: విదేశాల్లో కాంగ్రెస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న శ్యామ్ పిట్రోడా హ్యాకర్ల బారిన పడ్డారు. తన స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ సర్వర్ హ్యాకింగ్‌కు గురయ్యాయని శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
క్రిప్టో కరెన్సీ రూపంలో వేలాది డాలర్లు ఇవ్వకుంటే తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిస్తామని హ్యాకర్లు బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన మెయిల్ లేదా మొబైల్ నుంచి ఏదైనా మెయిల్, మెసేజ్ వస్తే దానిపై క్లిక్ చేయవద్దని, అటాచ్మెంట్ ఉంటే డౌన్లోడ్ చేయవద్దని ఆయన కోరారు. చికాగోకు చేరుకున్న వెంటనే భద్రతా సమస్యలను పరిష్కరించి, సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను మెరుగు పరుస్తానని తెలిపారు.