ముంబై, అక్టోబర్ 18: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నుంచి రూ.5 కోట్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు ఒక బెదిరింపు సందేశం వచ్చింది. ‘ఈ బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్ గ్యాంగ్‌తో వైరం ముగించాలన్నా రూ.5 కోట్లు ఇవ్వాలి. లేదంటే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీకి పట్టిన గతే పడుతుంది’ అని అందులో బెదిరించారు. దీనిపై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించిందని ఓ అధికారి శుక్రవారం తెలిపారు.