Salman Khan : ‘సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా, లారెన్స్ బిష్ణోయ్‌తో శతృత్వాన్ని ముగించుకోవాలన్నా తమకు రూ.5 కోట్లు చెల్లించాలి. లేదంటే సల్మాన్ పరిస్థితి బాబా సిద్ధిఖీ కంటే దారుణంగా ఉంటుంది. ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు’ అంటూ ముంబై ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ నంబర్‌కు గురువారం రాత్రి ఒక మెసేజ్ వచ్చింది. దాంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. సల్మాన్ ఖాన్ ఇంటిదగ్గర భద్రతను పటిష్టం చేశారు. ఖాన్ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు కలిసి అక్కడ పహారా కాస్తున్నారు.
మరోవైపు బెదిరింపు మెసేజ్ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలావుంటే సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. హర్యానాలోని పానిపట్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 1998లో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడటంతో అటు కేసులో ఇరుక్కోవడమే కాకుండా ఇటు లారెన్స్ బిష్ణోయ్ గాంగ్కు టార్గెట్‌గా మారారు.
కృష్ణ జింకను బిష్ణోయ్ వర్గం ప్రజలు దైవంలా భావిస్తారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడటం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు ఆగ్రహం తెప్పించింది. అప్పటి నుంచి సల్మాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు ఆ గ్యాంగ్ కుట్రలు పన్నుతూనే ఉంది. గత జూన్‌లో కూడా బైక్‌పై సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్టుమెంట్ వద్దకు వచ్చిన ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనపై దర్యాప్తు సాగుతుండగానే బాబా సిద్ధిఖీ హత్య, సల్మాన్‌కు బెదిరింపుల ఘటనలు చోటుచేసుకున్నాయి.
#WATCH | Security heightened outside #SalmanKhan‘s residence after the actor receives fresh threats.
(📹: ANI) pic.twitter.com/6y14oj9avd
— Hindustan Times (@htTweets) October 18, 2024