Saif Ali Khan | ముంబై: తన ఆపార్ట్‌మెంట్‌లో దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కోలుకుంటున్నారు. 54 ఏండ్ల సైఫ్‌పై కత్తితో దాడి చేసిన దుండగుడు గురువారం ఉదయం 8 గంటల వరకు బాంద్రా స్టేషన్లోనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
పరారైన తర్వాత నిందితుడు తన చొక్కాను మార్చుకుని నీలం రంగు షర్ట్‌ను ధరించి, భుజాన బ్యాగ్‌తో కన్పించాడు. కాగా, ఈ కేసులో పోలీసులు వారిస్ అలీ సల్మానీ అనే కార్పెంటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు సైఫ్ ఫ్లాట్‌లో రెండు రోజుల క్రితం పనిచేశాడు. దుండగుడి ఆచూకీ కోసం 20 పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. కాగా, సైఫ్ ఆరోగ్యం బాగుందని, 3 రోజుల్లో డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.