Sachin Tendulkar | ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ చూశా.. ఆర్మీలో భాగమైనందుకు అదృష్టవంతుడిని..!
Sachin Tendulkar : కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు ధైర్యసాహసాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న 'ఆపరేషన్ సఫేద్ సాగర్' (Operation Safed Sagar) సిరీస్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
Sachin Tendulkar : కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు ధైర్యసాహసాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ (Operation Safed Sagar) సిరీస్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా భారత మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సైతం ఈ సిరీస్‌కు ఫిదా అయ్యాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ఈ సిరీస్ చూశాక తాను ఆర్మీలో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నాని భారత దిగ్గజం పేర్కొన్నాడు. ఎక్స్ వేదికగా ఈ సిరీస్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు సచిన్.
పాకిస్థాన్‌తో 1999లో కార్గిల్ యుద్ధం నేపథ్యంలో వచ్చిన ఆపరేషన్ సఫేద్ సాగర్ సిరీస్‌ను సచిన్ టెండూల్కర్ తెగ ప్రశంసించాడు. భారత సైనికులు శౌర్య, పరాక్రమాలను ప్రతిబింబించిన ఈ సిరీస్ గొప్పగా ఉందని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నాడీ వెటరన్. ‘ఇప్పుడే ఆపరేషన్ సఫేద్ సాగర్ సిరీస్ చూడడం పూర్తైంది. సైనికులకు జీవితం ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించేలా చేసింది. ఒత్తిడిని, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయేందుకు వారు పడే కష్టం కళ్లముందు మెదిలింది. చాలా ఏళ్ల క్రితం నేను ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాను కలిశాను.
Dear @IAF_MCC,
Just finished watching Operation Safed Sagar. It made me think about how different life is for the people who are out there, carrying the pressure and uncertainty, while the rest of us are able to sleep peacefully and carry on with our everyday lives.
I had met… pic.twitter.com/vbwzmpxIUx
— Sachin Tendulkar (@sachin_rt) September 1, 2026
ఆపరేషన్ సఫేద్ సాగర్ చూశాక కార్గిల్ యుద్ధం సమయంలో ఆయన, చాలామంది సైనికులు ఎంతటి తెగువ చూపించారో అర్ధమైంది. అందుకు వారిపట్ల ఆరాధన భావం పెరిగిపోయింది. వాళ్ల ధైర్యసాహసాలు అసాధారణం. అలానే వారి క్రమశిక్షణ, మానసిక ద్రుఢత్వం కూడా అంతేస్థాయిలో ఉన్నాయి. ఈ సిరీస్ చూశాక ఐఏఎఫ్‌లో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నా. ఈ హోదాకు ఉన్న విలువెంటో అర్ధమైంది. ఈ స్టోరీ చూడడం ద్వారా నేను మరింత గర్వపడుతున్నా. మాకోసం ఎంతో చేసిన మీకు ధన్యవాదాలు. జై హింద్’ అని సచిన్ తన పోస్ట్‌లో వెల్లడించాడు. భారత క్రికెట్‌కు విశేష సేవలందించిన సచిన్‌ను భారత సైన్యం 2010లో గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ హోదాతో గౌరవించిన విషయం తెలిసిందే.
అభిజీత్ పర్మార్, కుశాల్ శ్రీవాత్సవ(ఎయిర్‌పోర్స్ మాజీ అధికారి)లు ఆపరేషన్ సఫేద్ సాగర్‌ను రూపొందించారు. అభిజీత్ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించగా.. కుశాల్ క్రియేటర్‌గా వ్యవహరించాడు. ఈ సిరీస్‌లో సిద్దార్థ్, అభయ్ వర్మ, అర్ణవ్ భాసిన్, ప్రజక్త కోలీ, మిహిర్ అహుజాల, దియా మిర్జాలు ప్రధాన పాత్రల్లో నటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

