తిరువనంతపురం: శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో ఇటీవల ఓ సినిమా షూటింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ (టీడీబీ) స్పందించింది. ఆలయ పరిసరాల్లో మలయాళ దర్శకుడు అనురాజ్ మనోహర్ వీడియోగ్రఫీ చేసినట్టు ఆరోపణలు వచ్చాయని తెలిపింది.
‘అయితే తాము ఆయనకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపింది. ఈ షూటింగ్ వ్యవహారంపై ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు చేస్తామని వెల్లడించింది. కాగా, తాను అయ్యప్ప గుడిలో కాకుండా పంపా నది వద్ద వీడియో తీశానని దర్శకుడు మనోహర్ చెప్పారు.