న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin).. పదోసారి ఇండియా పర్యటనకు వస్తున్నారు. ఇవాళ, రేపు ఆయన ఢిల్లీలో పర్యటిస్తారు. ఇవాళ రాత్రి ప్రధాని మోదీతో ప్రైవేటు డిన్నర్‌కు హాజరవుతారు. రేపు ఇరు దేశాల నేతల మధ్య పలు అంశాల్లో ఒప్పందాలు జరగనున్నాయి. అయితే వ్లాదిమిర్ పుతిన్ ఇండియాకు రావడం ఇది పదోసారి అవుతుంది. గతంలో ఆయన 2002, 2004, 2012, 2014, 2016, 2018, 2021 సంవత్సరాల్లో దేశాధ్యక్షుడిగా హోదాలో భారత్‌లో టూర్ చేశారు. రష్యా ప్రభుత్వ వర్గాల ప్రకారం దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పుతిన్ సుమారు 72 దేశాల్లో పర్యటించినట్లు తెలుస్తోంది.