న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్ కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రధాని మోదీని కలుసుకునే సీనియర్ మంత్రులు సహా అందరికీ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌ను తప్పనిసరి చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మంగళవారం ప్రధానిని ఆయన నివాసంలో కలుసుకున్న ప్రతినిధుల బృందం ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేయించుకున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. అలాగే ప్రధాని మోదీని కలుసుకోబోయే పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను బీజేపీ నిర్వహిస్తున్నది.