Romantic Stunts : ఓ ప్రేమ జంట విహారయాత్రకు బైకుపై వెళ్తోంది. ఆ సమయంలో జిల్లా ఎస్పీ అదే మార్గంలో తన కారులో వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రేమ జంట బైకు మీద రొమాంటిక్ స్టంట్స్ చేయడాన్ని ఆయన గమనించారు. వెంటనే తన మొబైల్ ఫోన్లో ఆ ప్రేమ జంట రొమాంటిక్ స్టంట్స్‌ను వీడియో తీశాడు. అనంతరం వాళ్లను అడ్డగించి చలానా వేశాడు. అనంతరం బైకుపై ఇలాంటి స్టంట్స్ వేయవద్దని హెచ్చరించి పంపాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం జాష్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జాష్పూర్ జిల్లా ఎస్పీ శశిమోహన్ సింగ్ ఓ పనిమీద కుంకురికి వెళ్లి తిరిగి జాష్‌పూర్‌కు వస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రేమ జంట బైకుపై రొమాంటిక్స్ స్టంట్స్ చేస్తూ ఆయన కంటబడింది. వినయ్ అనే యువకుడు బైకు నడుపుతుండగా.. సుహానా అనే యువతి పెట్రోల్ ట్యాంకుపై వినయ్ వైపు ముఖం చేసి, అతని భుజంపై తల వాల్చి కూర్చుంది. ఈ రొమాంటిక్ స్టంట్స్‌ను ఎస్పీ తన మొబైల్ ఫోన్లో బంధించారు. అనంతరం వాళ్లను అడ్డగించి చలానా వేశారు. మరోసారి ఇలాంటి స్టంట్స్ చేయవద్దని హెచ్చరించి పంపారు.
అంతకుముందు ప్రేమ జంటను ఎస్పీ ఇంటరాగేట్ చేయగా తాము మయాలీ డ్యామ్‌ను సందర్శించేందుకు వచ్చామని, సుహానా సరదాపడుతుంటే కాదనలేక ఈ స్టంట్స్ చేశామని వినయ్ తెలిపాడు. కాగా, ఎస్పీ చిత్రీకరించిన ప్రేమ జంట రొమాంటిక్ స్టంట్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ కింది వీడియోలో ఆ దృశ్యాలపై మీరు కూడా ఓ లుక్కేయండి.
CG : प्रेमिका को बाइक की टंकी पर बिठाकर फिल्मी अंदाज में रोमांस और स्टंट कर रहा था युवक-युवती, एसपी जशपुर शशिमोहन सिंह ने पकड़ा !!
देखिए VIDEOकटनी-गुमला नेशनल हाईवे पर एक प्रेमी जोड़े का बाइक पर स्टंट करते हुए वीडियो सामने आया है !!
इस वीडियो को कुनकुरी पुलिस ने पुलिस अधीक्षक… pic.twitter.com/nqzmPlzCHu— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) May 11, 2024