Robert Vadra | అమేథీ: ప్రియాంక గాంధీ భర్త, రాబర్ట్ వాద్రా రాజకీయ రంగప్రవేశం చేయనున్నట్టు తెలుస్తున్నది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ నుంచి పోటీ చే సేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్న ట్టు సమాచారం. ‘నేను పోటీ చేస్తే.. అమేథీకి ప్రాధాన్యమిస్తా. రాజకీయాల్లో నా తొలి అడుగులు అమేథీ నుంచే ఉండాలి’ అని ఆయన గురువారం ఏఎన్ఐతో అన్నారు. అమేథీ.. గాంధీ కుటుంబ సభ్యుడిని కోరుకుంటున్నదని వాద్రా తెలిపారు. ఇ ప్పటి వరకు అమేథీ స్థానానికి కాం గ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు.