పాట్నా: జ్యుయలరీ షాపులోకి కొందరు వ్యక్తులు ప్రవేశించారు. గన్స్‌తో అక్కడి సిబ్బందిని బెదిరించారు. ఆ షాపులోని బంగారు నగలు, ఆభరణాలు, డబ్బును దోచుకున్నారు. (Robbers Loot Jewellery Shop) ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ఆ షాపులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి షాపు మూసే సమయానికి పాత పోస్టాఫీసు రోడ్డులో ఉన్న అనిల్ జ్యుయలరీలోకి కొందరు వ్యక్తులు ఒక్కొక్కరుగా ప్రవేశించారు.
కాగా, కస్టమర్లుగా వచ్చిన ఆ వ్యక్తులు గన్స్ తీశారు. ఆ షాపులోని సిబ్బందిని బెదిరించారు. ఒక సిబ్బంది నుంచి తాళాలు తీసుకున్నారు. ఒక వ్యక్తి, మహిళ కలిసి ర్యాకుల్లో ఉన్న నగల బాక్సులను తెరిచారు. బంగారు ఆభరణాలతోపాటు కౌంటర్లోని డబ్బును బ్యాగులో వేసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ జ్యుయలరీ షాపు వద్దకు చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆ షాపు సిబ్బందిలో కొందరిపై అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించామని, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీస్ అధికారి వెల్లడించారు. మరోవైపు జ్యుయలరీ షాపులో దోపిడీకి సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
CCTV: समस्तीपुर पुरानी पोस्ट आफिस रोड स्थित अनिल ज्वेलर्स में कैसे हुई करोड़ों की लूट, देखिये#samastipur #news #loot #cctv pic.twitter.com/UVowpuOaIh
— Samastipur Town (@samastipurtown) November 24, 2024