Rajnath Singh | న్యూఢిల్లీ/లక్నో, మే 11: భారత వ్యతిరేక శక్తులపై మన సైనిక బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయని, పహల్గాం ఉగ్రదాడి బాధితులకు న్యాయం జరిగిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ ‘సిందూర్’లో మన సైనిక బలగాల సింహగర్జన కేవలం సరిహద్దు ప్రాంతాలకే పరిమితం కాకుండా పాకిస్థాన్ సైనికదళ ప్రధాన కార్యాలయమున్న రావల్పిండిలోనూ ఎంతో బిగ్గరగా ప్రతిధ్వనించిందని చెప్పారు.
బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రం ప్రారంభం
లక్నోలో బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణుల ఉత్పత్తి కేంద్రాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం వర్చువల్గా ప్రారంభించారు. రూ.300 కోట్ల వ్యయంతో ఏర్పాటైన ఈ కేంద్రంలో ఏటా 80 నుంచి 100 బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేస్తారు. తదుపరి తరం బ్రహ్మోస్ క్షిపణులను ఇక్కడే తయారు చేయనున్నారు.