ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా ద్వారకలోని సెక్టార్ 18లో అతుల్య చౌక్ వద్ద రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. అటుగా వచ్చిన కారు ఇలా దిగబడింది. ఈ కారు ఢిల్లీలోని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ది. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో యజమాని కారులోనే ఉన్నాడు. అతనికేం గాయాలు కాలేదు. కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు.