Road accident | డివైడర్ దూకి అవతలి రోడ్డులో ట్రక్కును ఢీకొట్టిన స్కార్పియో.. నలుగురు అక్కడికక్కడే మృతి..!
Road accident | ఓ స్కార్పియో (Scarpio) వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నది. మితిమీరిన వేగం కారణంగా డివైడర్ పైనుంచి ఎగిరి అవతలి లేన్లోకి వెళ్లింది. ఆ లేన్ ఎదురుగా వస్తున్న ట్రక్కు (Truck) ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.
Road accident : ఓ స్కార్పియో (Scarpio) వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నది. మితిమీరిన వేగం కారణంగా డివైడర్ పైనుంచి ఎగిరి అవతలి లేన్లోకి వెళ్లింది. ఆ లేన్ ఎదురుగా వస్తున్న ట్రక్కు (Truck) ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్ (West Midnapur) జిల్లాలో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
పశ్చిమబెంగాల్ రాష్ట్రం వెస్ట్బుర్డ్మాన్లోని అసన్సోల్ పట్టణ వాసులైన నలుగురు వ్యక్తులు ఒడిశాలోని బాలేశ్వర్కు స్కార్పియో వాహనంలో బయలుదేరారు. ఉదయం 6 గంటల సమయంలో వారి వాహనం పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని బెల్దా పరిధిలోగల రాణిసరాయ్ గ్రామానికి చేరుకోగానే 16వ నెంబర్ జాతీయ రహదారిపై అదుపుతప్పింది.
డివైడర్ను ఢీకొని అవతలి లేన్లోకి ఎగిరిపడింది. అవతలి లేన్లో టమాటా లోడుతో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దాంతో స్కార్పియో కారు మొత్తం నుజ్జునుజ్జయ్యింది. అందులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read More >>
వాహనం నడుపుతూ నిద్రలోకి డ్రైవర్.. కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు దుర్మరణం..!
రాధికా యాదవ్ హత్య కేసు.. ఆమె తండ్రికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
పెళ్లి కాకుండానే పిల్లకు తల్లి.. పుట్టగానే రూ.50 వేలకు బిడ్డ అమ్మకం.. ఐదుగురు అరెస్ట్..!
తీసుకున్న అప్పు తిరిగివ్వనందుకు.. టీనేజీ పిల్లలతో ఆ పని చేయించారు..!
ఫ్రీడమ్ ఫైటర్స్ను ఉగ్రవాదులుగా.. బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

