Road accident : అతివేగం ఒకే కుటుంబానికి చెందిన 8 నిండు ప్రాణాలను బలితీసుకుంది. జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) రాష్ట్రంలోని అనంతనాగ్ (Anantnag) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చి ఓ టాటా సుమో అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఫల్టీలు కొడుతూ కిందకు పడిపోయింది. డక్సుమ్ (Daksum) ఏరియాలో శనివారం మధ్యాహ్నం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
కిష్టవార్ జిల్లాకు చెందిన ఒకే కుటుంబ సభ్యులు తమ గమ్యానికి చేరుకునే క్రమంలో మార్గమధ్యలో ప్రమాదం బారినపడ్డారు. టాటా సుమోలోని 8 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామన్నారు. ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
#WATCH | Jammu and Kashmir: People of the same family met with a car accident in the Daksum area of Anantnag district. Further details awaited. pic.twitter.com/zDoU7eJqXv
— ANI (@ANI) July 27, 2024