పాట్నా, మే 30: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్-బీజేపీ బంధంపై ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో నితీశ్‌కు పొసగడం లేదని, ఎన్నికలైన జూన్ 4 తర్వాత రాష్ట్రంలో ‘పెనుమార్పు’ జరగబోతున్నదని పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత చాచా (నితీశ్) పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారని రెండ్రోజుల క్రితం తాను చెప్పినప్పటి నుంచీ ఆయన ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లడం లేదని పేర్కొన్నారు. అధికారులతో గవర్నర్ సమావేశాలు నిర్వహించి ఆదేశాలు కూడా జారీచేస్తున్నట్టు తనకు తెలిసిందని తేజస్వీ యాదవ్ తెలిపారు.