హైదరాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ( RGIA ) ఇండియాతో పాటు మధ్య ఆసియాలో ఉత్తమ ప్రాంతీయ ఎయిర్‌పోర్టు అవార్డు వరించింది. వరుసగా మూడో ఏడాది ఈ అవార్డును దక్కించుకున్నట్లు జీఎంఆర్ ( GMR ) వెల్లడించింది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్టు అవార్డుల కార్యక్రమంలో ప్రకటన చేసినట్లు తెలిపింది.
టాప్ -100 జాబితాలో హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు 64వ స్థానం లభించగా, శుభ్రతలో 3, ఎయిర్‌పోర్టు సిబ్బంది విషయంలో 4వ స్థానంలో, ఆసియాలో బెస్ట్ రిజీనల్ ఎయిర్‌పోర్టుగా ఆర్జీఐఏకు 6వ ర్యాంకు వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ 100 విమానాశ్రయాల్లో.. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.. 2020లో 71వ స్థానం నిలవగా, 2021లో 64వ స్థానానికి చేరుకుంది.
We’re proud to be the Best regional airport in India and Central Asia at the #SkytraxAwards, for 3 years in a row! We owe this award to our passengers and stakeholders.#FlyHYD #HYDAirport @MoCA_GoI @PMOIndia @TelanganaCMO @KTRTRS @ACIAPAC @skytrax_uk @GroupeADP @JM_Scindia pic.twitter.com/MD0faErpyI
— RGIA Hyderabad (@RGIAHyd) August 9, 2021