న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) ప్యాకేజీ రేట్లను సవరిస్తూ కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ఆఫీస్ మెమొరాండంను జారీ చేసింది. ఈ ధరలు ఈ నెల 13 నుంచి అమల్లోకి వస్తాయి. సీజీహెచ్ఎస్ ఎంపానెల్డ్ హెల్త్‌కేర్ ఆర్గనైజేషన్లలో పొందే ఆరోగ్య సంరక్షణ సేవలకు ఈ ధరలు వర్తిస్తాయి. అక్రెడిటేషన్ స్టేటస్, హాస్పిటల్ టైప్, సిటీ క్లాసిఫికేషన్, వార్డ్ ఎన్టైటిల్మెంట్ల ఆధారంగా సవరించిన రేట్లను ప్రభుత్వం హేతుబద్ధం చేసింది. నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ఆఫ్ ల్యాబొరేటరీస్ (ఎన్ఏబీఎల్), నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ (ఎన్ఏబీహెచ్)లకు అనుబంధం కాని హెల్త్‌కేర్ ఆర్గనైజేషన్స్ (హెచ్‌సీఓ)లకు ఎన్ఏబీహెచ్/ఎన్ఏబీఎల్ హెచ్సీవోల కన్నా 15 శాతం తక్కువ ధర అమలవుతుంది.