ముంబై: ఒక పని కోసం లంచం తీసుకున్న రెవెన్యూ అధికారి ఏసీబీ అరెస్ట్ నుంచి తప్పంచుకునేందుకు బైక్పై పారిపోయాడు. మహారాష్ట్రలోని థాణే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. షాపూర్ తాలూకాలోని ఖుత్ఘర్ షాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సొసైటీ పేరుతో ఉన్న భూమిని తన పేరుపై మార్చేందుకు స్థానిక రెవెన్యూ అధికారిని ఆశ్రయించాడు. అయితే ఈ పని కోసం ఆ అధికారి రూ.13,000 లంచం డిమాండ్ చేశాడు. చివరకు రూ.5,000కు ఒప్పందం కుదిరింది.
అయితే అధికారికి లంచం ఇచ్చేందుకు ఇష్టపడని ఆ వ్యక్తి థాణే అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)ని ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం ఆ రెవెన్యూ అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు ట్రాప్ వేశారు. రోడ్డుపై ఒక చోట అధికారికి ఆ వ్యక్తి రూ.3,000లు లంచం ఇచ్చాడు.
అయితే ఆ రెవెన్యూ అధికారి ఏసీబీ అధికారులను గమనించాడు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఆ వ్యక్తిని పక్కకు తోసి తన బైక్పై పరారయ్యాడు. ఈ నేపథ్యంలో ఆ అధికారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో అవినీతి కేసును ఏసీబీ నమోదు చేసింది.