న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(Sonia Gandhi) రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం జరగనున్నది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ పార్లమెంట్‌కు వచ్చిన సోనియాను మీడియా ప్రశ్నించింది. రేవంత్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్తున్నారా అని ఓ విలేకరి అడగ్గా.. బహుశా వెళ్తానేమో అని సోనియా స్పందించారు. ఇవాళ ఉదయం సోనియా నివాసానికి రేవంత్ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను కూడా రేవంత్ కలిశారు.
#WATCH | Delhi | “Probably yes,” says Congress Parliamentary Party Chairperson Sonia Gandhi when asked if she will go to Hyderabad, Telangana tomorrow.
State Congress chief Revanth Reddy will be sworn-in as the Chief Minister of Telangana in Hyderabad tomorrow. pic.twitter.com/4hcb6kPbmK
— ANI (@ANI) December 6, 2023