గురుగ్రామ్: బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో మత ఘర్షణలు కొనసాగుతున్నాయి. సోమవారం నూహ్ పట్టణంలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలను మరువక ముందే, ఇవాళ గురుగ్రామ్‌లోని బాద్షాపూర్ ఏరియాలో ఘర్షణలు చెలరేగాయి. దాదాపు 100 నుంచి 200 మంది వరకు ఉన్న అల్లరి మూకల గుంపు బైకులపై వచ్చి బాద్షాపూర్లోని దుకాణాలకు, వాహనాలకు నిప్పుపెట్టింది.
దాంతో గురుగ్రామ్‌లో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి గస్తీ నిర్వహిస్తున్నారు. గురుగ్రామ్ అంతటా 144 సెక్షన్ విధించారు. ముందు జాగ్రత్తగా ఫరీదాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిన్నటి ఘర్షణల నేపథ్యంలో ప్రస్తుతం నూహ్ పట్టణంలో కూడా కర్ఫ్యూ కొనసాగుతున్నది. నూహ్ ఘర్షణల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 47 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
#Watch | At least four eatery shops and scrap shops set ablaze by a group of men in sector 66, #Gurugram. More than 200 men in different vehicles carrying petrol bottles set them on fire.
(Reports @leenadhankhar) pic.twitter.com/QhtgKhZdF1
— Hindustan Times (@htTweets) August 1, 2023