న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: రైళ్లల్లో రిజర్వేషన్లను తనిఖీ చేసే టీటీలు సాధారణంగా ఓ కాగితాల కట్ట పట్టుకొని తిరిగేవారు. రైలు కదిలిన తర్వాత ఖాళీగా ఉండిపోయిన బెర్తులను తమ ఇష్టానుసారం కేటాయించేవారు. అందులో పారదర్శకత ఉండేది కాదు. ఈ సమస్య పరిష్కారానికి రైల్వే విభాగం చేతిలో ఇమిడే ట్యాబ్ లాంటి సాధనాన్ని టీటీలకు ఇస్తున్నది. దీనికి హ్యాండ్ హెల్డ్ టర్మినల్ (హెచ్హెచ్టీ) అని పేరు. అందులో సదరు రైలు సమాచారం అంటే రిజర్వేషన్ ఎంతవరకు జరిగిందీ, ఎవరైనా చివరి నిమిషంలో రాలేకపోయారా? రద్దు చేసుకున్నారా? అనే వివరాలు అందులో ఒలిచిపెట్టినట్టుగా ఉంటాయి. వెయిట్ లిస్టువాళ్లకు, ఇతరులకు రిజర్వేషన్ ఇవ్వాలంటే అంతా అరచేతిలో పని. పైగా ఆ ట్యాబ్స్ సెంట్రల్ రిజర్వేషన్ సర్వర్తో అనుసంధానించి ఉంటాయి. ఎవరైనా ఆ సమాచారాన్ని వీక్షించి రిజర్వేషన్ పరిస్థితి తెలుసుకోవచ్చు. దీంతో తమకు తోచిన విధంగా రిజర్వేషన్లు పంచేసే అవకాశం టీటీలకు ఉండదు.