అబుదాబి, ఏప్రిల్ 19: యూఏఈలో భారీ వర్షాలతో నెలకొన్న వరద పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక సూచన చేసింది. దుబాయ్‌కు వచ్చే వాళ్లు లేదా దుబాయ్ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు అత్యవసరం లేని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవాలని సూచించింది. విమానాశ్రయంలో సాధారణ స్థితికి వచ్చేంత వరకు ఈ సూచనలు పాటించాలని తెలిపింది. ఈ మేరకు భారత పౌరులకు అవసరమైన సమాచారం అందించేందుకు హైల్ప్‌లైన్ నంబర్లు: +971501205172, +971569950590, +971507347676, +971585754213 ఏర్పాటు చేసింది. మూడు రోజుల క్రితం దుబాయ్, సమీప ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే.