రాంచీ: ‘కేంద్రాన్ని చేతులు జోడించి వేడుకుంటున్నా.. రాష్ర్టానికి రావాల్సిన బొగ్గు బకాయిలు రూ.1.36 లక్షల కోట్లు విడుదల చేయండి’ అని జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి రాబోతున్న నేపథ్యంలో శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం జార్ఖండ్‌లో రెండు ర్యాలీల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. అమిత్ షా ఆదివారం మూడు సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ‘ప్రధాని, కేంద్ర హోంమంత్రి జార్ఖండ్‌కు వస్తున్నారు. రాష్ర్టానికి రావాల్సిన బొగ్గు బకాయిలను వెంటనే అందజేయాలని వారిని చేతులు జోడించి కోరుతున్నా. ఈ నిధులు రాష్ర్టానికి ఎంతగానో అవసరం’ అంటూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.