న్యూఢిల్లీ: కీలక వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI). వరుసగా ఎనిమిదోసారి కూడా వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయలేదు. రెపో రేటు 6.5 శాతంగానే కొనసాగనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ద్రవ్య పరపతి కమిటీ వివరాలను ఆయన వెల్లడిస్తూ.. ఆర్థిక వృద్ధి రేటు మెరుగ్గా ఉన్న కారణంగా.. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు. గడిచిన కొన్నాళ్ల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక సంక్షోభం వస్తూనే ఉన్నదని, కానీ భారతీయ ఆర్థిక వ్యవస్థ మాత్రం బలమైన పునాదులతో ఉందని, ఇలాంటి అస్థిర వాతావరణంలో చాలా అప్రమత్తంగా ఉండాలని దాస్ పేర్కొన్నారు.రెపో రేటును 6.5 శాతం వద్దే ఉంచామని, గతంలో 2023లో చివరిసారి రెపో రేటును మార్చినట్లు తెలుస్తోంది. రెపో రేటును యధాతథంగా ఉంచేందుకు ఆరుగురు ఎంపీసీ సభ్యుల్లో నలుగురు అనుకూలంగా ఉన్నారు.