బెంగళూరు: హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ పోలీస్ కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించారు. అతని ప్రియురాలు పవిత్రా గౌడ, మరో 11 మంది కస్టడీని కూడా న్యాయస్థానం శనివారం పొడిగించింది. వీరికి విధించిన ఆరు రోజుల పోలీస్ కస్టడీ ఆదివారంతో ముగియనుండటంతో కోర్టులో హాజరుపర్చారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని నిందితుల తరపు వారు కోరగా, ఈ కేసులో వారిని ఇంకా ప్రశ్నించాల్సి ఉన్నందున పోలీస్ కస్టడీని పొడిగించాలని దర్యాప్తు అధికారులు కోరారు. దీంతో కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్టు జడ్జి విశ్వనాథ్ తెలిపారు.