భోపాల్ : భారత ఉర్దూ కవుల్లో ప్రముఖులైన బషీర్ బద్(్ర91) గురువారం భోపాల్లో కన్నుమూశారు. ‘మీ జ్ఞాపకాల వెలుగు మాతోనే ఉండనివ్వండి(ఉజాలే అప్నీ యాదోంకే హమారే సాత్ రహ్నే దో), జీవితపు సాయంకాలం ఏ వీధిలో అస్తమిస్తుందో ఎవరికి తెలుసు (నా జాని కిస్ గలి మే జిందగీ కి శామ్ హో జాయే) లాంటి అత్యధికంగా ఉదహరించబడిన పంక్తులతో తన తరంలో ఆయన ప్రసిద్ధులయ్యారు.
చాలా ఏండ్ల నుంచి ఆయన చిత్త వైకల్యంతో బాధ పడుతున్నారు. ఆయన ద్విపద కవితలను ప్రముఖులతో పాటు సామాన్యులు తరచూ తమ మాటల్లో ఉదహరిస్తారు. పర్షియన్, హిందీ, ఆంగ్ల భాషల్లోనూ ఆయన నిష్ణాతులు.