న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: రెమ్డెసివిర్ ఔషధ ఎగుమతులపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గి పరిస్థితులు చక్కబడే దాకా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, రెమ్డెసివిర్ ఏపీఐలను విదేశాలకు ఎగుమతి చేయవద్దని ఉత్పత్తిదారులను ఆదేశించింది. అంతేకాకుండా దవాఖానలకు, రోగులకు రెమ్డెసివిర్ అందుబాటులో ఉండేందుకు చర్యలు చేపట్టింది. సాకిస్ట్/డిస్ట్రిబ్యూటర్ల వివరాలను, ఔషధ నిల్వలను రెమ్డెసివిర్ ఉత్పత్తిదారులు తమ వెబ్సైట్లలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.